Harish Rao: ఉప ఎన్నిక తర్వాత ఈటల నుంచి హుజూరాబాద్‌కు విముక్తి: హరీశ్‌రావు

TRS will win in Huzurabad by poll says Harish Rao
  • 200 మందితో హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఇల్లంతకుంట బీజేపీ మండలాధ్యక్షుడు
  • ఈటల తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారన్న హరీశ్
  • ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్న మంత్రి
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక తర్వాత హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్ నుంచి విముక్తి లభిస్తుందన్నారు. నియోజకవర్గంలోని ఇల్లంతకుంటకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్ 200 మంది పార్టీ కార్యకర్తలతో శనివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈటల తన ఆస్తులు కాపాడుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి బీజేపీలో చేరారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

Harish Rao
TRS
Etela Rajender
Huzurabad

More Telugu News