Rayalaseema Project: ఎన్జీటీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వండి... ఆ తర్వాతే అనుమతులు: రాయలసీమ ప్రాజెక్టుపై కేంద్రం స్పందన

  • ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు
  • అనుమతుల ప్రక్రియ వాయిదా వేసిన కేంద్రం
  • ఆరు అంశాలపై వివరణ కోరిన వైనం
  • తెలుగుగంగ దరఖాస్తుకూ ఇదే పరిస్థితి
Centre asks AP Govt explanation on NGT objections over Rayalaseema Project

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంలో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల దరఖాస్తును కేంద్రం పక్కనబెట్టింది. తెలంగాణ సర్కారు ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా జలాల ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతుల ప్రక్రియను పెండింగ్ లో ఉంచింది.

అంతేకాదు, ఎన్జీటీ అభ్యంతరాలపై బదులివ్వాలని, ప్రాజెక్టు లే అవుట్లు, చార్టులు సమర్పించాలని, ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు ద్వారా వాడుకునే నీటి పరిమాణం వివరాలు కూడా అందజేయాలని స్పష్టం చేసింది.

అటు తెలుగుగంగ పథకం అనుమతులకు సవరణ కోరుతూ చేసుకున్న దరఖాస్తు విషయంలోనూ ఏపీ సర్కారుకు ఇదే పరిస్థితి ఎదురైంది. దరఖాస్తులో స్పష్టత లేదని కేంద్రం వెల్లడించింది.

More Telugu News