తెలంగాణలో మరో 1,028 మందికి కరోనా పాజిటివ్

26-06-2021 Sat 18:34
  • గత 24 గంటల్లో 1,18,427 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 132 కేసులు
  • కామారెడ్డిలో ఒక్క కేసు నమోదు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • ఇంకా 15,054 మందికి చికిత్స
Telangana registers thousand plus corona cases

తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడచిన 24 గంటల్లో 1,18,427 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,028 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 132 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులను గుర్తించారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసు వెల్లడైంది.

అదే సమయంలో 1,489 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,627కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,19,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,01,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,054 మంది చికిత్స పొందుతున్నారు.