మేము రైతుల వైపు ఉన్నాం: రాహుల్ గాంధీ

26-06-2021 Sat 16:06
  • మా వైఖరి చాలా క్లియర్ అన్న రాహుల్ గాంధీ
  • మేము సత్యాగ్రహి అన్నదాతల వైపు ఉన్నామని వ్యాఖ్య
  • 7 నెలలు గడుస్తున్న రైతుల ఉద్యమం
We are with farmers says Rahul Gandhi
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు తమ నిరసన కార్యక్రమాలను మళ్లీ ఉద్ధృతం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో వారు ఉద్యమాన్ని చేపట్టి 7 నెలలు గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తన గళాన్ని వినిపించారు.

హిందీలో ఆయన ట్వీట్ చేస్తూ... తాము సత్యాగ్రహి అన్నదాతల వైపు ఉన్నామని చెప్పారు. ఇది చాలా క్లియర్ అని అన్నారు. తమ పోరాటంలో భాగంగా పలు రాష్ట్రాల రాజ్ భవన్ లను రైతులు ముట్టడించే ప్రయత్నం చేశారు. నవంబర్ 26న రైతుల ఉద్యమం ప్రారంభమైంది. కనీస మద్దతు ధరను కల్పించాలని, కొత్త చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పలు పార్టీలు రైతులకు మద్దతు పలుకుతున్నాయి.