Jammu And Kashmir: కశ్మీర్​ కు 370 ఆర్టికల్​ ను పునరుద్ధరించేదాకా ఎన్నికల్లో పోటీ చేయం: మెహబూబా ముఫ్తీ

Wont Participate Elections Until Article 370 Be Restored Says Mehabooba Mufti
  • కేంద్రం ఆ పనిచేయదని మాకు తెలుసు
  • ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరాల్సిందే
  • దీనిపై గుప్కర్ కూటమి ఉద్యమిస్తుంది
కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణాలు 370, 35ఏని పునరుద్ధరించే దాకా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, అధికార రాజకీయాల్లో భాగం కాబోమని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తేల్చి చెప్పారు. ఆ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోదని తనకు తెలుసని, కానీ, ఎప్పుడో ఒకప్పుడు అది జరిగి తీరాల్సిందేనని ఆమె అన్నారు. దాని కోసం తాము పోరాటం చేస్తామన్నారు. అనుకున్నది సాధించే వరకు గుప్కర్ కూటమి కలిసికట్టుగా ఉద్యమిస్తుందన్నారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కునే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 370ని రద్దు చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. 370, 35ఏ పునరుద్ధరణను కోరుకోవడం వేర్పాటువాద డిమాండ్ కాదన్నారు. కశ్మీర్ కు రాష్ట్రహోదా, ఎన్నికల కోసమే తాను ప్రధానితో సమావేశం కాలేదన్నారు. అది తమ ప్రాధాన్యం కాదని ఆమె వివరించారు.
Jammu And Kashmir
Mehbooba Mufti
Article 370

More Telugu News