అజారుద్దీన్ స్థానంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్

26-06-2021 Sat 13:38
  • హెచ్సీఏలో ముదురుతున్న వివాదం
  • జాన్ మనోజ్ ను ప్రెసిడెంట్ గా ప్రకటించిన అపెక్స్ కౌన్సిల్
  • ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మనోజ్
John Manoj appointed as HCA president in place of Azharuddin

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) లో వర్గపోరు ముదురుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్టు అపెక్స్ కౌన్సిల్ లేఖను విడుదల చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు అజారుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం జాన్ మనోజ్ హెచ్సీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం హెచ్సీఏలో వివాదాన్ని మరింత పెంచింది. మరోవైపు ఇటీవల అజారుద్దీన్ మాట్లాడుతూ, గతంలో జరిగిన అవినీతిని తాను ప్రశ్నిస్తున్నందుకే కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐతో చర్చిస్తానని చెప్పారు.