Mahesh Babu: సెట్స్ పైకి మహేశ్ బాబు కూడా సిద్ధం!

Mahesh Babu is ready for Sarkaru Vaari Paata shooting
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు 
  • మహేశ్ జోడీగా కీర్తి సురేశ్ 
  • తమన్ బాణీలు ప్రత్యేకం 
  • సంక్రాంతికి భారీ రిలీజ్  
కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో .. షూటింగు ఆపుకుని వెళ్లిన ప్రాజెక్టులన్నీ తిరిగి సెట్స్ పైకి చేరుకుంటున్నాయి. అలా 'సర్కారువారి పాట' సినిమా కూడా మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు జరుపుకుని, రెండవ షెడ్యూల్ మొదలుపెట్టిన తరువాత కరోనా ఉద్ధృతి పెరిగింది. దాంతో షూటింగు ఆపేశారు. మళ్లీ అక్కడి నుంచే షూటింగును మొదలుపెట్టనున్నారు. మహేశ్ బాబు తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు.

మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందని ఆమె చెబుతోంది. ఈ మధ్య కాలంలో తాను చేసిన విభిన్నమైన పాత్ర ఇది అనీ, ఈ పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అంటోంది. సుబ్బరాజు .. వెన్నెల కిషోర్ పాత్రలు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. ఈ రెండు పాత్రలు నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాయని చెబుతున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందుతున్న ఈ సినిమాకి, తమన్ బాణీలను సమకూర్చాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Mahesh Babu
Keerthi Suresh
Parashu Ram

More Telugu News