'మహాసముద్రం' నుంచి మరో స్పెషల్ పోస్టర్!

26-06-2021 Sat 11:37
  • అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం'
  • సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • ఆసక్తిని పెంచుతున్న తాజా పోస్టర్          
Mahasamudram Special Poster Released
అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో మల్టీ స్టారర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. వారి సరసన నాయికలుగా అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో 'గరుడ' రామ్ కనిపించనున్నాడు. ఆయన ఈ సినిమాలో 'ధనుంజయ్' అనే పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్రను .. ఆయన లుక్ ను పరిచయం చేస్తూ ఈ రోజున ఒక పోస్టర్ ను వదిలారు.'గరుడ' రామ్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుందనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది. 'కేజీఎఫ్' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న 'గరుడ' రామ్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ ఉత్కంఠను పెంచుతున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శర్వానంద్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.