Surya: యథార్థ సంఘటన ఆధారంగా సూర్య మూవీ!

Surya latest movie update
  • సూర్య నుంచి మరో విభిన్న చిత్రం
  • యాక్షన్ తో కూడిన ఎమోషన్
  • జులై 23వ తేదీన ఫస్టులుక్
  • కీలకమైన పాత్రలో సత్యరాజ్
తనకి .. అభిమానులకు మధ్య సూర్య ఎంతమాత్రం గ్యాప్ రానీయడు. జయాపజయాలకు అతీతంగా వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటాడు. తన సినిమాల్లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి కూడా స్థానం ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సమపాళ్లతో కూడిన యాక్షన్ .. ఎమోషన్ లతో సాగుతోందట. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాయి. సూర్య లుక్స్ డిఫరెంట్ గా ఉండటం ఆత్రుతను పెంచుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ఏమైవుంటుందనే విషయం అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమా ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోందనేది తాజా సమాచారం. కొంతకాలం క్రితం 'పొల్లాచ్చి'లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. సూర్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జులై 23వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, సత్యరాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.
Surya
Priyanka Arul Mohan
Sathya Raj

More Telugu News