Puvvada Ajay Kumar: ట్రైబ్యునల్ తీర్పులను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్

  • పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారు
  • తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం
  • రెండు రాష్ట్రాల వాటాలను కేంద్రం తేల్చాలి
AP govt not caring NGT verdicts says Puvvada Ajay

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. తాజాగా, ఏపీ ప్రభుత్వ తీరును తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తప్పుబట్టారు. ఆ రాష్ట్రం నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమమేనని ఆయన అన్నారు. పనులు ఆపుతామని చెప్పిన ఏపీ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు.

నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నదీ జలాల విషయంలో కేంద్రం కల్పించుకుని... ఇరు రాష్ట్రాల వాటాలను తేల్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి విషయంలో తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. టీకాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

More Telugu News