George Floyd: వచ్చేసిన తీర్పు.. నల్లజాతీయుడు ఫ్లాయిడ్‌ను హత్య చేసిన పోలీసు అధికారికి 270 నెలల జైలు శిక్ష

  • గతేడాది మే 25న జార్జి ఫ్లాయిడ్‌పై కర్కశం
  • మెడను మోకాలితో తొక్కిపట్టి ప్రాణాలు తీసిన డెరిక్
  • ఈ కేసులో ఇప్పటికే దోషిగా తేలిన మాజీ పోలీసు అధికారి
US Ex Police Officer Sentenced To Over 22 Years For George Floyd Murder

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మెడను కాలితో నొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి అతడి మరణానికి కారణమైన అమెరికా పోలీసుల అధికారి డెరిక్ చౌవిన్‌ (45)కు అమెరికా కోర్టు 270 నెలల (ఇరవై రెండున్నర సంవత్సరాలు) జైలు శిక్ష విధించింది. డెరిక్‌ను ఇదివరకే దోషిగా నిర్ధారించిన కోర్టు గత రాత్రి అతడికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. గతేడాది మే 25న జార్జి ఫ్లాయిడ్ మెడను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపట్టాడు. తనకు ఊపిరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా డెరిక్ కనికరించలేదు. ఆ తర్వాత ఫ్లాయిడ్‌ను ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఇందుకు సంబంధించి వీడియోలు, పొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

More Telugu News