PAN: పాన్-ఆధార్ అనుంధానం గడువు మరోసారి పొడిగించిన కేంద్రం

  • పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి
  • జూన్ 30తో ముగియనున్న పాత గడువు
  • మూడ్నెల్లు గడువు పెంచిన కేంద్రం
  • సెప్టెంబరు 30 తుదిగడువుగా ప్రకటన
Union govt extends deadline for three months for PAN and AADHAR linkup

పాన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించాలని కేంద్రం ప్రజలను ఎప్పటినుంచో కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి గడుపు పెంపు నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు గడువు విధించగా, అది మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటన చేసింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సెక్షన్ 139 ఏఏ ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం వివరించింది.

More Telugu News