ఓటీటీలోనే నితిన్ 'మాస్ట్రో' రిలీజ్?

25-06-2021 Fri 19:22
  • నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో'
  • 'అంధాదున్' సినిమాకి రీమేక్
  • టబు పాత్రలో తమన్నా
  • ఓటీటీ ద్వారా ఆగస్టులో రిలీజ్
Maestro will be released in OTT
నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో' రూపొందుతోంది. ఆ మధ్య హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో మేర్లపాక గాంధీ ఈ సినిమాను పట్టాలెక్కించాడు. నితిన్ సరసన నాయికగా నభా నటేశ్ అలరించనుండగా, హిందీలో 'టబు' చేసిన పాత్రను తమన్నా చేసింది. ఈ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని అనుకున్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ కానుందని అంటున్నారు.

కరోనా కారణంగా ఇంతవరకూ థియేటర్లు ఓపెన్ కాలేదు. ఒకవేళ ఓపెన్ అయితే లైన్లో చాలా సినిమాలే ఉన్నాయి. అందువల్లనే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. హాట్ స్టార్ వారు ఈ సినిమాను 32 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆగస్టు ఫస్టు వీక్ లో గానీ .. సెకండ్ వీక్ లో గాని ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఈ మధ్య నితిన్ నుంచి వచ్చిన 'చెక్' .. 'రంగ్ దే' సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. మరి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.