ఆసక్తిని రేపుతున్న 'వసంతకోకిల' టీజర్

25-06-2021 Fri 18:09
  • బాబీసింహా నుంచి 'వసంత కోకిల'
  • కొత్త దర్శకుడి పరిచయం
  • మూడు భాషల్లో విడుదల
  • కథానాయికగా కశ్మీర పరదేశి  
Vasantha Kokila teaser release

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా బాబీసింహాకు మంచి పేరు ఉంది. ఆయన హీరోగా 'వసంత కోకిల' రూపొందుతోంది. ఈ సినిమాతో రమణన్ పురుషోత్తం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజేశ్ మురుగేశన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను తమిళంతో పాటుగా తెలుగు .. కన్నడ భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాబీసింహా జోడీగా కశ్మీర పరదేశి కనిపించనుంది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

ఒక ప్రేమ జంట.. వాళ్లను రహస్యంగా వెంబడించే ఒక అపరిచితుడు చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. టీజర్ మొదటి నుంచి చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. కథలో అనేక అనూహ్యమైన మలుపులు ఉన్నాయనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. తమిళంలో బాబీసింహాకు మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగులో పెద్దగా తెలియదు. మరి ఈ సినిమా ఇక్కడ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.