ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కేసీఆర్ కు నిజాలు తెలుస్తాయి: షర్మిల

25-06-2021 Fri 18:04
  • వైయస్సార్ ది పెద్ద మనసు
  • పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు
  • పేదవాళ్లను కేసీఆర్ సర్కారు ఆదుకోవడం లేదు
If KCR comes out of farm house he will know the facts says YS Sharmila

తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిది పెద్ద మనసని వైయస్ షర్మిల అన్నారు. పేద వాళ్ల కోసం ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యాన్ని అందించిన ఘనత తన తండ్రిదని అన్నారు. పేదల కుటుంబాలను నిలబెట్టాలనే పథకం ఆరోగ్యశ్రీ అని చెప్పారు. అయితే తెలంగాణలో ఆరోగ్యశ్రీ అందడం లేదని మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.

పేదవాళ్లను కేసీఆర్ సర్కారు ఆదుకోవడం లేదని షర్మిల దుయ్యబట్టారు. షామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కేసీఆర్ కు నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఏదొచ్చినా కేసీఆర్ యశోదా ఆసుపత్రికి వెళ్తారని, పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. చెల్లెమ్మల కన్నీళ్లకు మీ దృష్టిలో విలువ లేదా? అని అడిగారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.