SBI: ఎస్బీఐ వినియోగదారులకు ఏటీఎం ఛార్జీల మోత!

  • ఎస్బీఐ సహా ఇతర ఏటీఎంలలో నెలకు నాలుగు సార్లు ఉచితంగా డబ్బు తీసుకునే అవకాశం
  • ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 15తో పాటు జీఎస్టీ అదనం
  • ఒక సంవత్సరానికి 10 చెక్ లీవ్స్ మాత్రమే ఉచితం
SBI new rules to come into effect from July 1

మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చెక్ బుక్ లు, క్యాష్ విత్ డ్రాలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలను ఎస్బీఐ వసూలు చేయబోతోంది.

కొత్త నిబంధనలు:

  • ఎస్బీఐ ఏటీఎంలతో పాటు మిగిలిన ఏటీఎంలతో నెలకు నాలుగు సార్లు మాత్రమే డబ్బులను ఉచితంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 15తో పాటు జీఎస్టీని వసూలు చేస్తారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
  • బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత ప్రతి చెక్ కు ఛార్జి వసూలు చేస్తారు. 10 లీవ్స్ తో ఉండ్ చెక్ బుక్ కు రూ. 40తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 25 లీవ్స్ చెక్ బుక్ కు రూ. 75తో పాటు జీఎస్టీ కట్టాలి. అయితే చెక్ బుక్ సర్వీస్ ఛార్జీల నుంచి సీనియర్ సిటిజెన్లకు మినహాయింపు  ఉంటుంది.
  • అత్యవసరంగా చెక్ బుక్ కావాలనుకునేవారు రూ. 50తో పాటు జీఎస్టీ కట్టాలి.

More Telugu News