'అఖండ' ఐటమ్ కోసం రాయ్ లక్ష్మీ!

25-06-2021 Fri 17:39
  • మళ్లీ సెట్స్ పైకి 'అఖండ'
  • నెక్స్ట్ షెడ్యూల్లో రాయ్ లక్ష్మీ
  • తమన్ నుంచి మసాలా ట్యూన్
  • కథానాయికగా ప్రగ్యా
Akhanda movie update

తెలుగు తెరకి కొత్త అందాలను పరిచయం చేసిన కథనాయిక రాయ్ లక్ష్మీ..  ఇతర భాషల్లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కథానాయికగా ఆమెకి కలిసి రాలేదు. దాంతో ఆమె ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఉత్సాహాన్ని చూపించింది. ఆమె చేసిన మాస్ మసాలా సాంగ్స్ పాప్యులర్ కావడంతో, స్పెషల్ సాంగ్స్ పరంగా బిజీ అయింది. ఆ మధ్య చిరూ సినిమాలో 'రత్తాలు ..' పాటలో ఆమె అందాల సందడి చేసింది. మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ సరసన మెరవనున్నట్టుగా తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మిగతా భాగం చిత్రీకరణ కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా కోసం తమన్ ఒక మసాలా సాంగ్ ను అందించాడట. ఈ పాట కోసం రాయ్ లక్ష్మిని తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తదుపరి షెడ్యూల్లో బాలకృష్ణ - రాయ్ లక్ష్మి తదితరులపై ఈ పాటను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.