Raghu Rama Krishna Raju: విజయసాయిరెడ్డి ఫిర్యాదును పట్టించుకోవద్దు: లోక్ సభ స్పీకర్ ను కోరిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju writes letter to Lok Sabha Speaker requesting not to consider Vijayasai Reddys letter
  • రఘురాజుపై అనర్హత వేటు వేయాలని ఓం బిర్లాకు విజయసాయి లేఖ
  • తన వైఖరి అసమ్మతి కిందకు రాదన్న రఘురాజు
  • పార్టీ విప్ ను ఏనాడూ వ్యతిరేకించలేదని వివరణ 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి ఫిర్యాదును పట్టించుకోవద్దని ఓం బిర్లాను రఘురాజు కోరారు. ఈ మేరకు స్పీకర్ కు ఆయన లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని సూచించడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని అన్నారు. పార్టీ వైఖరి పట్ల భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అసమ్మతి కిందకు రాదని చెప్పారు. అంతేకాదు, తన లేఖకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా జత చేశారు. పార్టీ విప్ ను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని చెప్పారు. తన ప్రవర్తన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని ఆయన పేర్కొన్నారు.

Raghu Rama Krishna Raju
Vijayasai Reddy
YSRCP
Om Birla
Lok Sabha Speaker

More Telugu News