Anandaiah: ఆనందయ్యకు సెల్యూట్ చేస్తున్నాం: మద్రాస్ హైకోర్టు జడ్జిలు

Madras High Court judges salutes Anandaiah
  • కరోనా మందును ఉచితంగా తయారు చేసి అందిస్తున్నారు
  • ఆనందయ్యను అభినందిస్తున్నాం
  • ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి
కరోనాకు ఆనందయ్య ఇస్తున్న మందుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఏపీలో కరోనా మందు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారని ప్రశంసించింది.

 ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ తమిళ్ సెల్వి, జస్టిస్ కరుణాకరణ్ సెల్యూట్ చేశారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానిస్తూ... ఆనందయ్యను అభినందించారు. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
Anandaiah
Corona Medice
Madras High Court

More Telugu News