Ravishankar Prasad: ట్విట్టర్ నా ఖాతాను గంటపాటు నిలిపివేసింది: కేంద్రమంత్రి రవిశంకర్

Twitter halts union minister Ravishankar Prasad account
  • ట్విట్టర్ వర్సెస్ కేంద్రం
  • కొనసాగుతున్న పోరాటం
  • రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతా నిలిపివేత
  • సొంత అజెండా అమలు చేస్తోందన్న కేంద్రమంత్రి
కేంద్రానికి, ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కు మధ్య పోరాటం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడంలేదు. అమెరికా చట్టాలను ఉల్లంఘించారంటూ ట్విట్టర్ తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను నిలిపివేసింది. అనంతరం గంట తర్వాత పునరుద్ధరించింది. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ సొంత అజెండా అమలు చేస్తోందని మండిపడ్డారు. ట్విట్టర్ తీరు చూస్తుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పనిచేస్తున్నట్టుగా లేదని విమర్శించారు. అనుకూలంగా వ్యవహరించని వారి ఖాతాలు స్తంభింపజేస్తోందని ఆరోపించారు. కొత్త ఐటీ చట్టాలకు కట్టుబడి నడుచుకోకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
Ravishankar Prasad
Twitter
Account
Violation

More Telugu News