231 కిలోమీటర్లు నడచి వచ్చిన అభిమానులు... రామ్ చరణ్ ఫిదా

25-06-2021 Fri 16:15
  • గద్వాల్ జిల్లా నుంచి కాలినడక
  • నాలుగు రోజుల ప్రయాణం
  • హైదరాబాద్ చేరుకున్న ముగ్గురు అభిమానులు
  • ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చరణ్
Ram Charan impressed after fans come across two hundred kilometres by walk

ముగ్గురు అభిమానులు ఏకంగా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్ కు నడిచి రావడం పట్ల హీరో రామ్ చరణ్ కదిలిపోయారు. రవి, వీరేష్, రాజ్... ఈ ముగ్గురు యువకులు మెగా వీరాభిమానులు. రామ్ చరణ్ అంటే వల్లమాలిన ఆరాధన. అందుకే 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి, నాలుగు రోజుల అనంతరం హైదరాబాద్ చేరుకుని రామ్ చరణ్ ను కలిశారు.

వీరి గురించి తెలుసుకున్న రామ్ చరణ్, వందల కిలోమీటర్లు నడిచి రావడం పట్ల విస్మయానికి గురయ్యారు. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడమే కాకుండా, వారితో ఫొటోలకు పోజులిచ్చారు. తనపై వారి ప్రేమకు చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.