Building: అమెరికాలో కుప్పకూలిన 12 అంతస్తుల భవనం... 99 మంది గల్లంతు

Building in Miami collapsed
  • మయామీలో ఘోర ప్రమాదం
  • అపార్ట్ మెంటులో కూలిన ఒకవైపు భాగం
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
అమెరికాలోని మయామీ నగరంలో ఓ 12 అంతస్తుల భవనంలోని ఒకవైపు కుప్పకూలింది. మొత్తం 136 ఫ్లాట్లలో 55 ఫ్లాట్లు కుప్పకూలినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు నిర్ధారించారు. మరో 99 మంది గల్లంతైనట్టు భావిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ చాంప్లైన్ టవర్స్ సౌత్ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఈ భవనంలోని మరోవైపున ఉన్న ఫ్లాట్ల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. దీని చుట్టు పక్కల ఉన్న భవనాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఇద్దరిని వెలికితీసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం వివరాలు తెలుపలేదు.
Building
Collapse
Miami
USA

More Telugu News