హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యం: డీకే అరుణ

25-06-2021 Fri 15:32
  • ఈటల ఘన విజయం సాధించబోతున్నారు
  • తలకిందుల తపస్సు చేసినా టీఆర్ఎస్ గెలవలేదు
  • కేసీఆర్ మద్దతుతోనే ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోతోంది
Etela will win Huzurabad elections says DK Aruna

తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని... ఈటల ఘన విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. తలకిందుల తపస్సు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలవలేదని అన్నారు.

ఈటల రూపంలో తెలంగాణలో బీజేపీకి మరో ఎమ్మెల్యే పెరగబోతున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ తీరుతో తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ మద్దతుతోనే కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతోందని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా వాసులను కేసీఆర్ కాళ్లతో తంతున్నారని దుయ్యబట్టారు.