చిరంజీవిని లాగొద్దు.. మంచు విష్ణుతో మాట్లాడాను: ప్రకాశ్ రాజ్

25-06-2021 Fri 12:37
  • ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అనే విషయాలు వద్దు
  • అందరూ అందరికీ కావాల్సిన వారే
  • ఎన్నికలు అసహ్యంగా మారకుండా చూద్దామని విష్ణుకు చెప్పాను
Why you are dragging Chiranjeevi asks Prakash Raj

టాలీవుడ్ లో మా ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనే ప్రచారం కూడా ప్రారంభమైంది. దీనికి ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కళాకారులు ఒక ప్రాంతానికే పరిమితం కాదని... యాక్టర్లు యూనివర్సల్ అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అనే విషయాలను కూడా తెరపైకి తీసుకురావద్దని కోరారు. ఈ పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారేనని చెప్పారు. పదవి కోసం తాను పోటీ చేయడం లేదని అన్నారు.

ఈ అంశంలోకి చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదని ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా మెగా బ్రదర్ నాగబాబుతో తనకు విరోధం ఉందని... కానీ పరిశ్రమ పరంగా తామంతా ఒక్కటేనని చెప్పారు. మంచు విష్ణుకు కూడా ఫోన్ చేశానని... ఎన్నికలను అసహ్యంగా మారకుండా చూద్దామని చెప్పానని అన్నారు. తమ ప్యానల్ లో నలుగురు అధ్యక్షులుగా ఉన్నవారేనని... తాను తప్పు చేస్తే బయటకు పంపించే గట్టివాళ్లు తమ ప్యానల్ లో ఉన్నారని చెప్పారు. అందరూ ఆశ్యర్యపోయేలా పని చేస్తామని చెప్పారు.