'హనుమాన్' మూవీ షూటింగ్ ప్రారంభం!

25-06-2021 Fri 12:06
  • తేజ సజ్జ హీరోగా 'హనుమాన్'
  • దర్శకుడిగా ప్రశాంత్ వర్మ
  • పూజా కార్యక్రమాలు పూర్తి
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
Prasanth Varma HanuMan movie was launched

మొదటి నుంచి కూడా ప్రశాంత్ వర్మ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. చిన్న సినిమాలనే కాదు ... భారీ బడ్జెట్ చిత్రాలను కూడా తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు. ఇటీవలే తాను ' హనుమాన్' సినిమాను చేయనున్నట్టు ప్రకటించాడు. దాంతో అందరిలోను ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో కథానాయకుడిగా తేజ సజ్జ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి .. ఆ తరువాత అది నిజమేననే విషయం స్పష్టమైంది. కరోనా ప్రభావం తగ్గడంతో, కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.కథానాయకుడు తేజ సజ్జపై నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇవ్వగా .. జెమినీ కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి శివశక్తిదత్త దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ప్రశాంత్ వర్మ - తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన 'జాంబి రెడ్డి' విజయాన్ని సాధించింది. పెద్ద గ్యాప్ ఇవ్వకుండానే ఈ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమా ద్వారా కొత్త కథానాయికను పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.