పెళ్లిలో మటన్ వండలేదని.. వివాహాన్ని రద్దు చేసుకున్నారు!

25-06-2021 Fri 10:56
  • ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లాలో ఘటన
  • మటన్ లేకపోవడంతో గొడవకు దిగిన పెళ్లికొడుకు బంధువు
  • మరుసటి రోజే మరొక అమ్మాయిని పెళ్లాడిన పెళ్లికొడుకు
Groom cancels marriage as there is no mutton in marriage dinner

రకరకాల కారణాలతో వివాహాలు రద్దవడం మనం చూస్తూనే ఉంటాం. చిన్నిచిన్ని కారణాలు కూడా పెద్ద వివాదాలుగా మారిపోయి పెళ్లిళ్లు రద్దవుతుంటాయి. ఒడిశాలో ఇలాంటి ఆసక్తికర ఘటనే మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జాజ్ పూర్ జిల్లా మనతిరా గ్రామంలో వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. అయితే విందులో మటన్ పెట్టకపోవడం వివాదానికి కారణమైంది.

తమకు మటన్ కావాలని పెళ్లికొడుకు బంధువులు అడగడంతో... మటన్ లేదని పెళ్లికూతురు బంధువులు సమాధానమిచ్చారు. దీంతో గొడవ మొదలైంది. తమ బంధువులకు పెళ్లికొడుకు కూడా వత్తాసు పలకడంతో వివాదం ముదిరించి. చివరకు పెళ్లికొడుకు తన వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, మరుసటి రోజు అతను మరొక యువతిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.