భారీ రేటుకు 'పుష్ప' హిందీ డబ్బింగ్ రైట్స్!

25-06-2021 Fri 10:47
  • ముగింపు దశలో 'పుష్ప' ఫస్టు పార్టు
  • రెండవ పార్టు షూటింగు వచ్చే ఏడాదిలో
  • బోట్ ఫైటింగ్ హైలైట్ అట
  • కథానాయికగా అలరించనున్న రష్మిక  
Huge rights for Pushpa hindi dubbing

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగానికి సంబంధించిన షూటింగు చివరిదశలో ఉంది. వచ్చేనెలలో షూటింగు పార్టును పూర్తిచేసి, దసరా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా వార్తలు వస్తున్నాయి. 17.5 కోట్లకు ఈ సినిమా హిందీ అనువాద హక్కులను అమ్మేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇది కేవలం 'పుష్ప' మొదటి భాగానికి సంబంధించిన అనువాద హక్కుల నిమిత్తం మాత్రమే. 'పుష్ప' రెండవ భాగం హక్కులకి సంబంధించిన ఆలోచన ఆ సినిమా పూర్తయిన తరువాతనే చేస్తారు. వచ్చే ఏడాదిలోనే రెండవ భాగం షూటింగు మొదలవుతుంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించిన బోట్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. తెలుగు తెరపై ఇంతవరకూ చూడని కొత్త పద్ధతిలో ఈ ఫైట్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.