చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 18 మంది మృతి

25-06-2021 Fri 08:34
  • మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో చెలరేగిన మంటలు
  • తీవ్రంగా గాయపడిన మరో 16 మంది
  • మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
18 killed in fire at martial arts centre in China

చైనాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌, షాంగ్‌కియు నగరంలోని ఝెచెంగ్ కౌంటీలో ఈ ఘటన జరిగింది.

మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 18 మందిని బలితీసుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.