సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

25-06-2021 Fri 07:27
  • శంకర్ తో కియారా రెండు సినిమాలు!
  • థియేటర్లకు వస్తున్న నాని సినిమా 
  • లారెన్స్ పాన్ ఇండియా ప్రాజక్ట్  
Kiara Advanis two films deal with director Shankar

*  బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రముఖ దర్శకుడు శంకర్ తో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఒకటి రామ్ చరణ్ హీరోగా శంకర్ రూపొందించే సినిమా కాగా.. మరొకటి రణ్ వీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో చేసే 'అపరిచితుడు' రీమేక్ అన్నది తాజా సమాచారం.
*  నేచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీశ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు.
*  హీరోగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ తొలి సారిగా పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. 'అధిగారం' పేరిట రూపొందుతున్న ఈ చిత్రానికి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన నిన్న వచ్చింది.