సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య

24-06-2021 Thu 21:57
  • తాడేపల్లి వచ్చిన ఆర్.కృష్ణయ్య
  • సీఎం జగన్ కు శాలువా కప్పి ఆత్మీయ సత్కారం
  • మీడియాతో మాట్లాడుతూ పొగడ్తల జల్లు
  • జనరంజక ముఖ్యమంత్రి అంటూ కితాబు
BC leader R Krishnaiah met CM Jagan in Tadepally

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన కృష్ణయ్య సీఎంను కలిసి పలు అంశాలపై ఆయనను అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు.

అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ సీఎం జగన్ పై పొగడ్తల జల్లు కురిపించారు. ఎక్కడా అవినీతికి తావులేని విధంగా పాలన అందిస్తున్నారని, జనరజంకమైన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రశంసించారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులకు సంబంధించి 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించారని, 56 బీసీ సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు నెలకొల్పారని కితాబునిచ్చారు. ముఖ్యంగా, చారిత్రాత్మక రీతిలో బీసీ బిల్లును వైసీపీ ద్వారా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని కొనియాడారు .