'లూసిఫర్' కోసం నయనతార .. అలా చెప్పిందట!

24-06-2021 Thu 18:42
  • త్వరలో సెట్స్ పైకి 'లూసిఫర్' రీమేక్
  • మంజు వారియర్ పాత్రలో నయన్
  • సింగిల్ షెడ్యూల్లో ఆమె పోర్షన్ పూర్తి
Lucifer movie remake update

తమిళనాట నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడి స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఆమెకి ఉంది. నాయిక ప్రధానమైన కథలను రెడీ చేసినవారు ముందుగా నయనతారనే సంప్రదిస్తూ ఉంటారు. నయనతార ఉంటే చాలు అక్కడి సినిమాలకు బిజినెస్ పరంగా ఎలాంటి సమస్య ఉండదు. తమ సినిమాను ఆమెతోనే చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేసే దర్శక నిర్మాతలు చాలామందినే ఉన్నారు. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఆనందంగా అంగీకరిస్తూ ఉంటారు.

అలాంటి నయనతారకు తెలుగులోను అదే స్థాయిలో క్రేజ్ ఉంది. అందువలన సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమెను తీసుకోవడానికే తొలి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే తమిళంలో బిజీగా ఉండటం వలన ఆమె ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేకపోతోంది. తాజాగా చిరంజీవి చేయనున్న 'లూసిఫర్' రీమేక్ కోసం కూడా నయనతారనే అడిగారట. మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్ర ఇది. అయితే తన పోర్షన్ ను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని నయనతార అందనీ, అందుకు మేకర్స్ అంగీకరించారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.