మళ్లీ సెట్స్ పైకి వచ్చేసిన 'వరుడు కావలెను'

24-06-2021 Thu 18:03
  • నాగశౌర్య నుంచి 'వరుడు కావలెను'
  • కథానాయికగా రీతూ వర్మ
  • దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్య
  • ఈ ఏడాదిలోనే రిలీజ్  
Varudu Kavalenu shooting Re started

నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ లేదు ... ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా 'లక్ష్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉండగా, 'వరుడు కావలెను' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా, ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. ఈ షెడ్యూల్లో నాగశౌర్య .. రీతూ వర్మ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమాకి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సగానికి పైగా షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. నాగశౌర్య మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.