పట్టాలెక్కవలసిందే .. ఉత్సాహంతో ఉన్న రామ్!

24-06-2021 Thu 17:29
  • ఫైనల్ నేరేషన్ పూర్తి
  • సూపర్ కిక్ వచ్చిందన్న రామ్
  • త్వరలోనే సెట్స్ పైకి
  • కథానాయికగా కృతి శెట్టి    
Ram new movie update

రామ్ కథానాయకుడిగా ఆమధ్య వచ్చిన 'రెడ్' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో రామ్ ఉన్నాడు. ఆయన తదుపరి చిత్రం లింగుసామి దర్శకత్వంలో రూపొందనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా రామ్ ఒక ట్వీట్ చేశాడు. లింగుసామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారనీ, అది విన్న తరువాత సూపర్ డూపర్ కిక్ వచ్చిందని చెప్పాడు. రోల్ దట్ కెమెరా.. అంటూ తాను ఎంత ఎగ్జైట్ అవుతున్నదీ తెలియజేశాడు.

రామ్ ట్వీట్ చూస్తే .. ఇక లేట్ చేయడం తన వలన కాదు .. సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కవలసిందే అనే ఉత్సాహం కనిపిస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం కృతి శెట్టికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం వలన, ఆమె ఈ సినిమాకి ప్లస్ కానుంది.

ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. లింగుసామి తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.