Kalyan Ram: 'మా' ఎన్నికల్లో కల్యాణ్ రామ్...?... స్పష్టతనిచ్చిన కల్యాణ్ రామ్ ప్రతినిధులు

Kalyan Ram team clarifies on MAA elections
  • త్వరలో 'మా' ఎన్నికలు
  • అధ్యక్ష పదవికి పలువురు పోటీ
  • బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ
  • కల్యాణ్ రామ్ పోటీ చేస్తున్నాడంటూ ప్రచారం
  • ఆ కథనాల్లో నిజంలేదన్న కల్యాణ్ రామ్ టీమ్
టాలీవుడ్ లో ఎన్నికల కోలాహలం నెలకొంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమరాంగణంలో హేమాహేమీలు నిలుస్తుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించగా, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ కూడా రేసులో నిలిచారు. అయితే, హీరో నందమూరి కల్యాణ్ రామ్ కూడా 'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. 'మా' ఎన్నికలపై కల్యాణ్ రామ్ ఆసక్తి చూపుతున్నాడని కథనాలు వచ్చాయి.

దీనిపై కల్యాణ్ రామ్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. కల్యాణ్ రామ్ 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని వెల్లడించారు. కల్యాణ్ రామ్ 'మా' అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. కాగా, మంచు విష్ణు ఇప్పటికే సినీ ప్రముఖులను కలుస్తూ మద్దతు కోరుతున్నట్టు తెలుస్తోంది. బరిలో ఉన్న ఇతరులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

మిగతా అందరికంటే ప్రకాశ్ రాజ్ రేసులో ముందున్నట్టు టాక్ వినిపిస్తోంది. సిని'మా' బిడ్డలం... మన కోసం మనం... అనే నినాదంతో ఆయన సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.
Kalyan Ram
MAA
Elections
Tollywood

More Telugu News