నేడు లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

24-06-2021 Thu 16:52
  • ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు
  • 393 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
  • 103 పాయింట్ల లాభంతో నిఫ్టీ
Stock Markets closed in green today

మన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో కళకళలాడాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో మార్కెట్లు లాభాలలో ముగిశాయి. దీంతో 393 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52699 వద్ద... 103 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15790 వద్ద ముగిశాయి.
 
ఇక నేటి సెషన్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బాలకృష్ణా ఇండస్ట్రీస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తదితర షేర్లు లాభపడ్డాయి. మరోపక్క, రిలయన్స్, టారెంట్ పవర్, బీహెచ్ఈఎల్, టాటా పవర్, అపోలో హాస్పిటల్, అదానీ పోర్ట్స్, అమర్ రాజా బ్యాటరీ, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.