ఇందిరాగాంధీ పాత్రలో కంగన రనౌత్

24-06-2021 Thu 11:04
  • ఇప్పటికే జయలలిత బయోపిక్ లో నటించిన కంగన
  • ఇందిర పాత్రను పోషించబోతున్నానని ప్రకటన
  • ఎమర్జెన్సీ కాలంనాటి పరిణామాల ఆధారంగా సినిమా
Kangana Ranaut to act in Indira Gandhi role

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ మరో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ 'తలైవి'లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ వర్షన్ కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కంగన మరో కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది.

అయితే, ఆ చిత్రం ఇందిరాగాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగన వెల్లడించింది. ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహించనున్నాడు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని కంగన నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.