బాలయ్య సరసన సందడి చేయనున్న మెహ్రీన్?

24-06-2021 Thu 10:08
  • మెహ్రీన్ చేతిలో 'ఎఫ్ 3' మాత్రమే
  • బాలకృష్ణ సినిమా కోసం సంప్రదింపులు 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్  
Gopichand Malineni movie update

బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మెప్పించే కథానాయిక కోసం చాలా రోజులుగా గోపీచంద్ మలినేని అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంలోనే నయనతార .. త్రిష .. శ్రుతిహాసన్ పేర్లు వినిపించాయి. అయితే వీరంతా ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. అందువలన డేట్లు దొరికే పరిస్థితి లేదట. ఈ నేపథ్యంలోనే తాజాగా మెహ్రీన్ పేరు తెరపైకి వచ్చింది.

మెహ్రీన్ కి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది .. అందువలన ఆమె కొంత కాలంగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. సీక్వెల్ కనుక 'ఎఫ్ 3' సినిమా చేయడానికి అంగీకరించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. అయితే కరోనా కారణంగా మెహ్రీన్ వివాహం వాయిదా పడింది. మళ్లీ ముహూర్తం నిర్ణయించేవరకూ .. వచ్చిన సినిమాలు చేయాలని ఆమె నిర్ణయించుకుందట. అందువలన బాలకృష్ణ సినిమాను ఆమె అంగీకరించే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అధికారిక ప్రకటన వస్తేనేగానీ నమ్మలేం. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాకుండా, ఆయన డాన్సులు .. ఫైట్లు కొత్తగా ఉండేలా గోపీచంద్ మలినేని ప్లాన్ చేశాడని అంటున్నారు.