ఇథియోపియాలో మారణహోమం.. వైమానిక దాడుల్లో 80 మంది మృతి

24-06-2021 Thu 09:45
  • సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య గత పోరు
  • విమానం నుంచి మార్కెట్లోకి జారవిడిచిన బాంబులు
  • క్షతగాత్రులకు వైద్యం అందించకుండా అడ్డుకుంటున్న సైన్యం
Witnesses say airstrike in Ethiopias Tigray kills dozens

ఇథియోపియాలోని ఉత్తర డిగ్రే ప్రాంతంలోని టొగొగాలో ఓ మార్కెట్‌పై జరిగిన వైమానిక దాడిలో 80 మంది మృతి చెందారు. వందలాదిమంది గాయపడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. గతేడాది నవంబరు నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) తిరుగుబాటు దళాలకు మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ వైమానిక దాడి జరిగింది. మార్కెట్‌పై విమానం నుంచి బాంబులు జారవిడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దాడిలో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని సైనికులు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి బయలుదేరిన అంబులెన్సులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. దీంతో  తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.