సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

24-06-2021 Thu 07:23
  • అమెజాన్ కోసం తమన్నా షో 
  • 'ఆచార్య' షూటింగుకి ఏర్పాట్లు
  • 'పుష్ప' కోసం రష్మిక బల్క్ డేట్స్  
Thamanna to do a show for Amezon Prime

 *  ఓపక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క వెబ్ సీరీస్ చేస్తూ బిజీగా వున్న కథానాయిక తమన్నాకు ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి తాజాగా మరో ఆఫర్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ ముద్దుగుమ్మ హిందీలో ఓ షోను నిర్వహించనున్నట్టు సమాచారం.
*  చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతూన్న 'ఆచార్య' సినిమా తదుపరి షూటింగును వచ్చే నెల మొదటి వారం నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. ఇరవై రోజుల పాటు జరిగే ఈ షూటింగులో చిరంజీవి, చరణ్ కూడా పాల్గొంటారు. ఈ షెడ్యూలుతో షూటింగ్ పూర్తవుతుంది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమా తాజా షెడ్యూలు షూటింగ్ జులై మొదటి వారం నుంచి జరుగుతుంది. ఇందుకోసం కథానాయిక రష్మిక బల్క్ డేట్స్ కేటాయించిందట. జులై 7న ఆమె షూటింగులో జాయిన్ అవుతుందనీ, సుమారు నెల రోజుల పాటు ఏకధాటిగా షూటింగులో పాల్గొంటుందని తెలుస్తోంది.