America: ఇక కరోనా వైరస్ ఏదైనా ఒకటే వ్యాక్సిన్.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

  • యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఆవిష్కరణ 
  • అభివృద్ధి చేసిన నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
  • ఎలుకలపై జరిపిన పరిశోధనలో రుజువైన సమర్థత
  • భవిష్యత్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకుని టీకా అభివృద్ధి
New Universal Coronavirus Vaccine May Help Prevent Future Pandemics

కరోనా వైరస్‌లో రోజుకో వేరియంట్ వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏదో ఒక వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసినవే. మున్ముందు మరెన్ని వైరస్‌లు చుట్టుముడతాయో చెప్పలేం. ఈ నేపథ్యంలో భవిష్యత్ కరోనా మహమ్మారులను దృష్టిలో పెట్టుకుని అమెరికా శాస్త్రవేత్తలు ‘యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్’ను అభివృద్ధి చేశారు. ఇది కరోనా వైరస్‌పైనే కాకుండా మరిన్ని వైరస్‌లపైనా సమర్థంగా పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లో తేలింది.

అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. జంతువుల నుంచి మానవులకు సోకే కరోనా వైరస్ కుటుంబానికి చెందిన ఇతర వైరస్‌లను ఎదుర్కొనేలా దీనిని అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ సమర్థత వెల్లడైంది. ప్రమాదకర వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

More Telugu News