దసరా దిశగా 'ఆచార్య' అడుగులు!

23-06-2021 Wed 17:54
  • ముగింపు దశలో 'ఆచార్య'
  • వచ్చేనెలలో చివరి షెడ్యూల్
  • 20 రోజుల్లో షూటింగు పూర్తి
  • దసరాకి థియేటర్ల దగ్గర సందడి
Acharya is going to relese at Dasara

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' రూపొందుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగు చివరిదశకు వచ్చేసింది. ఓ సింగిల్ షెడ్యూల్లో షూటింగు పార్టును పూర్తిచేయాలని చూస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. జులై మొదటివారంలో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టి, 20 రోజుల్లో చిత్రీకరణను పూర్తిచేస్తారట. ఈ షెడ్యూల్లో చిరంజీవి .. చరణ్ తదితరులు పాల్గొంటారని అంటున్నారు. ఆగస్టులో మిగతా కార్యక్రమాలను పూర్తిచేసి, దసరాకి విడుదల చేయలనే ఆలోచనలో ఉన్నారట.చిరంజీవి సరసన కథానాయికగా కాజల్ అలరించనుంది. అలాగే చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. 'సైరా' తరువాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కొరటాల మార్కు ఇష్టపడేవారు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దసరాకి భారీస్థాయిలో సందడి ఉండనున్నట్టు తెలుస్తోంది. మరో వైపున బాలకృష్ణ 'అఖండ' కూడా దసరా వైపే కదులుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందేమో చూడాలి మరి.