‘మా’ అధ్యక్ష పదవికి త్రిముఖ పోరు!

23-06-2021 Wed 13:08
  • ఎన్నికల బరిలోకి జీవితా రాజశేఖర్
  • ఇప్పటికే రంగంలోకి దిగిన మంచు విష్ణు
  • ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కూడా
  • రసవత్తరంగా ఎన్నికల పోరు
Triangle Fight In MAA President Elections

ఈసారి మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. తాజాగా జీవితా రాజశేఖర్ కూడా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మంచు విష్ణు పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత వెంటనే ప్రకాశ్ రాజ్ బరిలోకి దిగాడు. ఇప్పుడు తాజాగా జీవిత కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మంచు విష్ణుకు అనూహ్యంగా పోటీ పెరగడంతో సెప్టెంబర్ లో జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ప్రకాశ్ రాజ్ కు మెగా సోదరుడు నాగబాబు మద్దతు ప్రకటించారు. విష్ణుకు అండగా అతిని తండ్రి మోహన్ బాబు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద స్టార్లు ఎవరికి మద్దతిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.