Andhra Pradesh: 10 రోజుల్లో టీటీడీ పాలకమండలి: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

we will form ttd administration council in 10 days says AP Endowment Minister
  • 21తో ముగిసిన పాలకమండలి గడువు
  • నేడు కాణిపాకం అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • దేవాలయాల అభివృద్ధికి నిధులిస్తున్నామన్న మంత్రి
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి, వాటి రక్షణ కోసం ప్రభుత్వం తరఫున నిధులను కేటాయిస్తున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో పది రోజుల్లో పాలకమండలిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాణిపాకం అభివృద్ధి కోసం ఇవ్వాళ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మరోపక్క, టీటీడీ పాలకమండలి గడువు ఈ నెల 21తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త పాలకవర్గ నియామకం కోసం ఇప్పటికే కసరత్తులను ప్రారంభించారు.  
Andhra Pradesh
TTD
Vellampalli Srinivasa Rao

More Telugu News