Sridevasena: 8వ తరగతి వరకు టీసీలు లేకుండా పాఠశాలల్లో చేరొచ్చు: తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్

  • టీసీలు ఇచ్చేందుకు సతాయిస్తున్న ప్రైవేటు పాఠశాలలు
  • టీసీలు అవసరం లేదన్న విషయం విద్యాహక్కు చట్టంలో ఉందన్న శ్రీదేవసేన
  • సమస్యలు ఎదురైతే డీఈవోలకు ఫిర్యాదు చేయాలని సూచన
No TC Required Up to 8th class says Sri Devasena

విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన స్పందించారు. నిజానికి 8వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు టీసీ అవసరం లేదని, విద్యాహక్కు చట్టంలో టీసీ అవసరం లేదన్న విషయం స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లోని డీఈవోలను సంప్రదించాలని సూచించారు. కొత్త పాఠశాలల్లో చైల్డ్ ఇన్ఫో డేటాలో పేరు నమోదు అయ్యేలా చూడాలని శ్రీదేవసేన సూచించారు.

More Telugu News