CM KCR: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం మెనూ ఇదిగో!

  • యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • దత్తత గ్రామం వాసాలమర్రిలో భోజనం
  • 23 రకాల వంటకాలతో మెనూ
  • మాంసాహార, శాకాహార వంటకాలతో మెనూ
CM KCR menu in Vasalamarri grand dining

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో పర్యటించడం తెలిసిందే. వేలమంది గ్రామస్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో ఈ గ్రామంపై రాష్ట్రస్థాయిలో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇటీవలే సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామ సర్పంచి అంజయ్యకు స్వయంగా ఫోన్ చేసి తన పర్యటనను నిర్ధారించారు. తాను వాసాలమర్రి గ్రామ ప్రజలతోనే భోజనం చేస్తానని తెలిపారు. దాంతో సీఎం కోసం 23 రకాల వంటకాలతో భారీ మెనూ సిద్ధం చేశారు.

చేపలు, కోడిమాంసం, వేటమాంసం, బోటీ, తలకాయ కూర, గుడ్లు, పప్పు, పచ్చిపులుసు, బిర్యానీ, పులిహోర, పాలక్ పన్నీర్, పలు రకాల చట్నీలు, మజ్జిగ పులుసు, సాంబారు, వంకాయ కూర, రసం, బంగాళాదుంప కర్రీ, మసాలా అప్పడాలు, స్వీట్లు రెండు రకాలు అందుబాటులో ఉంచారు. వీటిలో సీఎం కేసీఆర్ కొన్నింటితోనే భోజనం ముగించినట్టు తెలుస్తోంది.

More Telugu News