డబ్ల్యూటీసీ ఫైనల్: న్యూజిలాండ్ 249 ఆలౌట్... 32 పరుగుల స్వల్ప ఆధిక్యం

22-06-2021 Tue 21:19
  • సౌతాంప్టన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్
  • భారత్ వర్సెస్ కివీస్
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 217 రన్స్
  • భారత్ స్కోరును అధిగమించిన కివీస్
  • 49 పరుగులు చేసిన విలియమ్సన్
  • షమీకి 4 వికెట్లు
New Zealand all out in first innings of WTC Final

సౌతాంప్టన్ లో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 249 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ పై 32 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 101/2 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, ఆఖర్లో జేమీసన్ (21), సౌథీ (30) ధాటిగా ఆడడంతో కివీస్ జట్టు భారత తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ 3 వికెట్లు సాధించాడు. అశ్విన్ 2, జడేజా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.