గోవాలో 'పుష్ప'రాజ్ ఇంట్రడక్షన్ సాంగ్!

22-06-2021 Tue 19:21
  • ఫారెస్టు నేపథ్యంలో సాగే కథ
  • తదుపరి షెడ్యూల్ గోవాలో
  • మాస్ ను మెప్పించే దేవిశ్రీ సంగీతం
  • ముఖ్యమైన పాత్రలో ఐశ్వర్య రాజేశ్
Pushpa introduction song shoots in goa

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతవరకూ మారేడుమిల్లి .. రంపచోడవరం అడవుల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపారు. ఈ అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు పూర్తి సంతృప్తితో ఉన్నారట. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు, తిరిగి మొదలుకానుంది. తదుపరి షెడ్యూల్ ను 'గోవా'లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ గోవాలో లొకేషన్స్ ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు.

గోవాలో అల్లు అర్జున్ కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను .. ఆయన ఇంట్రడక్షన్స్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా డిజైన్ చేయడం జరిగిందని అంటున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఐశ్వర్య రాజేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ప్రతినాయకుడిగా ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని చెబుతున్నారు.