'కూ'యాప్ లో ఖాతా తెరిచిన అందాల అనుష్క

22-06-2021 Tue 19:05
  • ఆదరణ పొందుతున్న దేశీయ యాప్ కూ
  • ఖాతాలు తెరుస్తున్న సెలబ్రిటీలు
  • తాను కూడా కూలో ఎంటరైనట్టు అనుష్క వెల్లడి
  • అభిమానులతో అప్ డేట్లు పంచుకుంటానంటూపోస్టు
Tollywood heroine Anushka Shetty enters into Koo app

ఇటీవల కాలంలో కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం కొనసాగుతుండడంతో... దేశీయ సోషల్ నెట్వర్కింగ్ యాప్ 'కూ' క్రమేణా ఆదరణ పొందుతోంది. 'కూ'లో ఖాతాలు తెరుస్తున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ అందాలభామ అనుష్క కూడా 'కూ'లో ప్రవేశించారు. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా 'కూ'లో ప్రకటించారు. తాను కూడా 'కూ'లో కాలుమోపానని, ఇకపై తన అప్ డేట్లను అభిమానులతో 'కూ' వేదికపైనా పంచుకుంటానని వెల్లడించారు. కాగా అనుష్క 'కూ'లో తొలి పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చిపడ్డారు.