సెట్టింగ్స్ కోసమే 100 కోట్లు ఖర్చు చేసిన 'రాధేశ్యామ్'?

22-06-2021 Tue 18:47
  • పునర్జన్మలతో కూడిన ప్రేమ
  • ఇటలీ నేపథ్యలో నడిచే కథ
  • త్వరలో ఫస్టు సింగిల్
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్    
Huge budjet for Radhe Shyam settings

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ 'రాధేశ్యామ్' సినిమాను రూపొందిస్తున్నాడు. పునర్జన్మలతో కూడిన ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కథలో చాలా భాగం ఇటలీ నేపథ్యంలో నడుస్తుంది. అందువలన ముందుగా ఇటలీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత అక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సెట్స్ వేశారు. కథ ప్రకారం ఈ సినిమా కోసం భారీ సెట్టింగులు వేశారు. అలా మొత్తం 26 రకాల సెట్టింగులు వేశారనీ .. ఇందుకోసం అయిన ఖర్చు 100 కోట్లు అని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సీమను విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నారు. అందుకోసం కూడా భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ అని అంటున్నారు. ప్రభాస్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలుస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ వదలనున్నారనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.