'బంగార్రాజు'లో రమ్యకృష్ణ ప్లేస్ కి ఢోకా లేదట!

22-06-2021 Tue 18:26
  • యాక్షన్ మూవీ సెట్స్ పై నాగ్
  • లైన్లోకి వచ్చేసిన 'బంగార్రాజు'
  • మరో యంగ్ హీరోయిన్ కి ఛాన్స్
  • త్వరలో మిగతా వివరాలు  
Ramyakrishna role is confirm in Bangarraju

'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర ఒక రేంజ్ లో జనంలోకి వెళ్లింది. దాంతో ఆ పాత్ర పేరుతోనే సినిమా చేయాలని నాగార్జున అప్పట్లోనే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ కథపై కసరత్తు చేస్తూనే వచ్చాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ  చేస్తున్న నాగార్జున, ఆ తరువాత ప్రాజెక్టుగా 'బంగార్రాజు' చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయని అంటున్నారు.

'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో సీనియర్ నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలోనూ నాగార్జున సరసన ఆమెనే కనిపించనుందనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా 'జయప్రద' పేరు తెరపైకి వచ్చింది. దాంతో ఈ సినిమాలో రమ్యకృష్ణ కనిపించదేమోననే సందేహం అందరిలో మొదలైంది. అయితే రమ్యకృష్ణ ప్లేస్ కి ఎలాంటి ఢోకా లేదట. ఆమె కాకుండానే జయప్రదను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ జోడీగా ఓ యంగ్ హీరోయిన్ ను కూడా ఎంపిక  చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.